![]() |
![]() |

ప్రముఖ నటి హేమ(Hema)ను బెంగళూరు పోలీసులు "నిను వీడని నీడను నేనే" అన్నట్టుగా వెంటాడుతున్నారు. ఇటీవల బెంగుళూరులో రేవ్ పార్టీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో హేమతో పాటు పలువురు సెలబ్రిటీల పాల్గొన్నారు. ముఖ్యంగా నార్కోటిక్ టెస్ట్ లో.. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడం సంచలంగా మారింది. దీంతో మే 27న జరిగే విచారణకు హాజరు కావాలంటూ.. హేమతో సహా మొత్తం ఎనిమిది మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే హేమ మాత్రం తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరుతూ లేఖ రాసింది. ఇలాంటి పప్పులు మా దగ్గర ఉడకవు అంటూ ఆమె లేఖను పరిగణలోకి తీసుకోని పోలీసులు.. జూన్ 1న విచారణకు హాజరుకావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈసారి కూడా హేమ విచారణకు హాజరు కాకపోతే.. పోలీసులు చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
![]() |
![]() |