![]() |
![]() |

ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి..టైటిల్స్ పెట్టడంలో వర్సటైల్ డైరెక్టర్ గుణ శేఖర్(gunasekhar) తర్వాతే ఎవరైనా..తన మొదటి సినిమా రామాయణం మినహాయిస్తే సొగసు చూడతరమా, చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, నిప్పు, ఒక్కడు, సైనికుడు, అర్జున్, వరుడు,రుద్రమదేవి, శాకుంతలం. ఇలా వెరైటీ టైటిల్స్ ఫిక్స్ చెయ్యడంలో గుణశేఖర్ దిట్ట. రీసెంట్ గా తన కొత్త మూవీ టైటిల్ ని ప్రకటించాడు.
యుఫోరియా.. పేరు వింటేనే చాలా వెరైటీ ఉంది కదు. ఇప్పుడు ఆ పేరునే గుణశేఖర్ తన కొత్త సినిమా టైటిల్ గా అనౌన్స్ చేసాడు. గ్రాండ్ గా ఒక వీడియో విడుదల చేసి మరి చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో యు ట్యూబ్ ని షేక్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలోనే రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని తెలియచేసారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ పై నీలిమ గుణ నిర్మిస్తుంది. ఈమె గుణశేఖర్ కూతురు. గతంలో రుద్రమదేవి, శాకుంతలం చిత్రాలని కూడా నిర్మించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. హీరోతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా మరికొద్ది రోజుల్లో తెలియనున్నాయి.

యుఫోరియా పక్కా యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా తెరకెక్కనుంది. దీంతో గుణ శేఖర్ ఏం చెప్పబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఉంది.ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా ఒక దానికొకటి అసలు సంబంధం ఉండదు.దేనికవే విభిన్నమైనవి. డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ లైన్ తో కూడి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలుగచేస్తాయి.ఈ నేపథ్యంలో యుఫోరియా స్టోరీ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. సబ్జట్ కి తగ్గ టేకింగ్ గుణశేఖర్ స్పెషాలిటీ. హీరోగా ఎవరు చేస్తారు అనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది.
![]() |
![]() |