![]() |
![]() |

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. విజయ్, రష్మిక కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, ఫెస్టివల్స్ జరుపుకోవడం చేస్తుంటారు. విజయ్ ఫ్యామిలీతో కూడా రష్మికకు మంచి అనుబంధముంది. ఈ క్రమంలో తాజాగా రష్మిక చేసిన కామెంట్స్.. విజయ్ తో ఆమె లవ్ ని కన్ఫర్మ్ చేసేలా ఉన్నాయి.
విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'గం గం గణేశా' (Gam Gam Ganesha) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రష్మిక గెస్ట్ గా హాజరైంది. ఈ సందర్భంగా ఆనంద్-రష్మిక మధ్య క్యూట్ సంభాషణ జరిగింది. రష్మికను కొన్ని ప్రశ్నలు అడిగి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు ఆనంద్. ముఖ్యంగా "మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు?" అని ఆనంద్ అడగగా.. నవ్వుతూ "నీ యబ్బ" అంటూ ఓ లుక్ ఇచ్చింది రష్మిక. ఆ తర్వాత "ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా.. ఇట్ల స్పాట్ లో పెడితే ఎట్లా" అని రష్మిక అన్నది. ఆ తర్వాత వెనుక నుంచి అభిమానులు విజయ్ పేరు చెప్పు అన్నట్టుగా "రౌడీ.. రౌడీ.." అని అరవడంతో.. సిగ్గుపడుతూ "రౌడీ బాయ్" అని చెప్పేసింది రష్మిక. మొత్తానికి "ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా" అంటూ విజయ్ తో తన ప్రేమని రష్మిక చెప్పకనే చెప్పేసింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |