![]() |
![]() |

యుగపురుషుడు నందమూరి తారక రామారావు జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్.. తన తాతకు నివాళులర్పించారు. అలాగే సోషల్ మీడియా వేదికగానూ తన తాతను గుర్తు చేసుకున్నారు.
"నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.." అంటూ సోషల్ మీడియా వేదికగా సీనియర్ ఎన్టీఆర్ ఫొటోను పంచుకున్నారు తారక్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

![]() |
![]() |