![]() |
![]() |

ఛలో తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే ఇండియన్ టాప్ హీరోయిన్ లో ఒకరిగా మారిన నటీమణి రష్మిక (rashmika) పుష్ప 2 (pushpa 2) ది గర్ల్ ఫ్రెండ్, కుబేర, రెయిన్ బో, చావా లాంటి భారీ సినిమాల్లో చేస్తు చాలా బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్, మురుగుదాస్ కాంబోలో తెరకెక్కుతున్న సికిందర్ లోనే రష్మిక నే కధానాయిక అనే వార్తలు వస్తున్నాయి. ఇంత బిజీలో కూడా ఒక హీరో బాధ్యత నాది అంటు ఒక సినిమా ఫంక్షన్ కి హాజరవుతుంది.
విజయ్ దేవరకొండ (vijay devarakonda)తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) అప్ కమింగ్ మూవీ గం గం గణేశా (gam gam ganesha)ఈ నెల 31 న విడుదల కానుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతుంది. హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో ఈ రోజు అత్యంత భారీగా జరగబోతుంది.ఈ ఈవెంట్ కి రష్మిక ముఖ్య అతిధిగా హాజరవ్వబోతుంది.మాములుగా ఇలాంటి వాటికి హీరోలు హాజరవవుతుంటారు. సదరు హీరోకి తమ మద్దతు తెలపడంతో పాటు సినిమాని ఆదరించమని ప్రేక్షకులని కోరతారు. అలాంటిది హీరో ప్లేస్ లో రష్మిక హాజరవవుతుందంటే ఆమె రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల రిలీజ్ అయిన గం గం గణేశా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రముఖ కధారచయిత విజయేంద్ర ప్రసాద్ దగ్గర పని చేసిన ఉదయ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.హాయ్ లైఫ్ ఎంటర్ టైన్మెంట్ పై కేదార్ అండ్ వంశీ లు నిర్మిస్తున్నారు. ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్ గా చేస్తుంది.

ఇక ఫంక్షన్లో ఆనంద్ దేవరకొండ గురించి రష్మిక ఏం మాట్లాడుతుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.ఎందుకంటే విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లో నటించారు. ఆ ఇద్దరు లవ్ లో ఉన్నారనే ప్రచారం ఎప్పటినుంచో జరగుతుంది. ఈ క్రమంలో అందరిలోను ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది 2019 లో దొర సాని అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ ఖాతాలో మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం,బేబీ లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి .
![]() |
![]() |