![]() |
![]() |
.webp)
సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్ల ని రాబట్టే అతి తక్కువ మంది హీరోల్లో మహేష్ బాబు (mahesh babu)కూడా ఒకడు. ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన గుంటూరు కారంతో ఆ మాట నిజమని మరోసారి అర్ధమయ్యింది. రీసెంట్ గా మహేష్ బాబు ఒక ట్వీట్ చేసాడు. ఒక మాములు హీరో చేసిన ట్వీటే వైరల్ గా మారే రోజులు ఇవి. అలాంటిది సూపర్ స్టార్ చేస్తే ఇంకేమైనా ఉందా. పైగా తన ఫ్యామిలీ గురించి చేస్తే. ట్విట్టర్ రికార్డు వ్యూస్ తో బద్దలయ్యి పోదు. ఇప్పుడు అదే జరుగుతుంది.
మహేష్ బాబు కి కొడుకు గౌతమ్ కృష్ణ (gowtham krishna)కూతురు సితార (sitara)లు ఉన్నారు. వారిద్దరు అంటే మహేష్ కి ఎంతో ప్రాణం. గౌతమ్ ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసాడు. ఈ సందర్భంగా గౌతమ్ ని అభినందిస్తు మహేష్ ఒక ట్వీట్ చేసాడు.నా హృదయం గర్వంతో నిండిపోయింది. ఇక నుంచి నీ కెరీర్ లో కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది. కాకపోతే ఆ అధ్యాయాన్ని నువ్వే రాసుకోవాలి. నీ కలలను సాధించేందుకు ముందుకు సాగు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. నీపై మా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజు తండ్రిగా నిన్ను చూసి గర్వపడుతున్నాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు శుభాకాంక్షలు అంటు ట్వీట్ చేసాడు. ఇప్పుడు మహేష్ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ వైరల్ గా మారింది.
కాకపోతే అభిమానులు మాత్రం ఒక్కసారి గతంలోకి వెళ్లిపోయారు. 2014 లో మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వన్ నేనొక్కడినే అనే మూవీ వచ్చింది. అందులో చిన్నప్పటి మహేష్ గా గౌతమ్ నటించాడు. ఏడేళ్ల వయసులోనే ఎలాంటి బెరుకు లేకుండా నటించి తన బ్లడ్ లోనే నటన ఉందని నిరూపించాడు. దీంతో గౌతమ్ హీరోగా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)సినిమాతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ ఇంకా స్టార్ట్ కానప్పటికీ తన లుక్ విషయంలో శ్రద్ద తీసుకుంటు బిజీగానే ఉన్నాడు.ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటుంది. ప్రతిష్టాత్మక సంస్థ దుర్గ ఆర్ట్స్ ఆ చిత్రాన్ని నిర్మిస్తుంది
![]() |
![]() |