![]() |
![]() |

2006 లో వచ్చిన ఫోటో చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన భామ అంజలి (anjali)ఆ మూవీ తర్వాత తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పదహారు సినిమాలు దాకా చేసింది. వాటన్నింటిలో కూడా తనే హీరోయిన్. దీన్ని బట్టి ఆమె స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తిరిగి 2013 లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan)సరసన గేమ్ చేంజర్ (game changer)లో చేస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)చరణ్ కాంబోలో గేమ్ చేంజర్ తెరకెక్కుతుంది. కియారా అద్వానీ (kiyara adwani)హీరోయిన్. అంజలి కూడా స్క్రీన్ షేర్ చేసుకోనుంది. కాకపోతే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. దీని పైనే అంజలి తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్‌లో నేను హీరోయిన్ ని కాదని ఎవరు చెప్పారు. క్యారక్టర్ ఆర్టిస్ట్ ని అని మేకర్స్ ప్రకటించలేదు కదా. నేను కూడా మూవీలో ఒక హీరోయిన్ నే. నా క్యారక్టర్ కి ఫ్లాష్‌బ్యాక్ ఉంది.ఒక అందమైన పాట కూడా ఉంది. ఇంతకుమించి నేను ఏం చెప్పలేనంటు చెప్పుకొచ్చింది. చాలా రోజులుగా గేమ్ చేంజర్ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంజలి ఒక చరణ్ కి జోడిగా మెరవబోతుందని అంటున్నారు.
.webp)
అంజలి అచ్చమైన తెలుగు అమ్మాయి. రవి తేజ తో బలుపు, సూర్య తో సింగం టూ, విక్టరీ వెంకటేష్, రామ్ ల మసాలా, తనే ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన గీతాంజలి సిరీస్, బాలకృష్ణ తో డిక్టేటర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం తో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతానికి అన్ని భాషలు కలుపుకొని యాబై కి పైగా చిత్రాల్లో నటించింది.
![]() |
![]() |