![]() |
![]() |
.webp)
సంవత్సరం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)అప్ కమింగ్ మూవీ ఓజి (og) టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల మెదడులని ఒక ప్రశ్న తొలుస్తూ ఉంది. ఆఫ్ కోర్స్ ఇప్పటికీ చాలా మంది ఆ దిశగా ఆలోచిస్తున్నారనుకోండి. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని.. కాదు కాదు ఇంకేదో అర్ధం ఉందని రకరకాలుగా చెప్పుకుంటు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలైన అర్ధం బయటకి వచ్చింది
శర్వానంద్ తో రన్ రాజా రన్, ప్రభాస్ (prabhas)తో సాహూ ని తెరకెక్కించిన సుజిత్ ఓజి కి దర్శకుడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఓజి టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ ని బయటపెట్టాడు. ఓజీ అంటే ఓజాస్ గంభీర్ అని అర్థం. మూవీలో ఓజాస్ అనేది మాస్టర్ పేరు, గంభీర్ అంటే హీరో పేరు. రెండూ కలిపితే ఓజీ అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పవన్ ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతేసేలా ఒక సూపర్ వార్త ని చెప్పుకొచ్చాడు. మూవీ మొత్తం జపాన్ స్టైల్లో ఉంటుందని పవన్ తో ఆ విధంగా సినిమా చెయ్యాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యానని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సుజిత్ కి కూడా తెలియని విషయం ఏంటంటే పవన్ ఫ్యాన్స్ లో ఇంకొన్ని కొత్త డౌట్స్ ని నింపాడు. ఓజాస్ అనేది మాస్టర్ పేరు అని చెప్పుకొచ్చాడు సరే. ఆ మాస్టర్ పవనేనా లేక వేరే వ్యక్తి నా అనేది తెలియాలి. ఒక వేళ వేరు వేరు అయితే పవన్ మాస్టర్ గా ఎవరు చేశారనే ఆసక్తి కూడా అందరిలో ఉంది

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయిన నేపధ్యంలో పవన్ కంటిన్యూగా ఓజి కి డేట్స్ ఇవ్వబోతున్నాడు. పవన్ తో చెయ్యాల్సిన సీన్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. పవన్ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీ ఓజి నే. సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. సలార్ శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య(danayya)తన డివివి ఎంటర్ టైన్మెంట్ పై అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. థమన్ (thaman)మ్యూజిక్ డైరెక్టర్.
![]() |
![]() |