![]() |
![]() |

మూవీ : కలియుగం పట్టణంలో
నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్ర శుక్లా, దేవి ప్రసాద్, రూప లక్ష్మీ, ప్రమోదిని తదితరులు
ఎడిటింగ్: గ్యారీ బి హెచ్
సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
మ్యూజిక్: అజయ్ అర్సాడ
నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
దర్శకత్వం: రమాకాంత్ రెడ్డి
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ:
మోహన్ అతని భార్య కల్పన నంద్యాలలో ఉంటారు. వారిద్దరికి ఇద్దరు కవల పిల్లలు పుడతారు. ఒకరు సాగర్, మరొకరు విజయ్. అయితే సాగర్ తన చిన్నతనంలో పెంపుడు జంతువులని చంపేస్తుంటాడు. అది తెలుసుకున్న కాలనీ వాసులు మోహన్ ని తిడుతూ , అవమానిస్తుంటారు. ఇక సాగర్ ని తీసుకెళ్ళి మానసిక వైద్యశాలలో పడేస్తాడు తండ్రి మోహన్. తల్లి మాత్రం నిత్యం సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మోహన్ మాత్రం అతని విషయంలో అయిష్టంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. కాలక్రమంలో విజయ్ పెద్దవాడవుతాడు .. ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. తన అన్నయ్య మామూలు మనిషి కాగానే అతడిని ఇంటికి తీసుకురావాలనుకుంటాడు. అదే అదే సమయంలో కాలేజ్ లో విజయ్ ని శ్రావణి ప్రేమిస్తూ ఉంటుంది. శ్రావణి పిన్ని పులి కూడా ఓ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. తన బాస్ ప్రభాకర్ ఆదేశం మేరకు నంద్యాల చేరుకుంటుంది పులి. ఇక అదే సమయంలో తన అన్నయ్యను కలుసుకోవడానికి విజయ్ మానసిక వైద్యశాలకు వెళ్తాడు. అయితే అక్కడి నుంచి సాగర్ బయటికి వస్తాడు. లోపల ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. విజయ్ స్థానంలో ఉన్నది సాగర్ అనే విషయాన్ని తల్లి గమనిస్తుంది. అయితే సిటీలో అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. మానసిక వైద్యశాల నుంచి బయటపడిన సాగర్ ఏం చేశాడు? నంద్యాలలో వరుస హత్యలు చేస్తుందెవరో పోలీసులు కనిపెట్టారా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
సినిమా ప్రారంభంలోనే పెంపుడు జంతువులని మర్డర్స్ చేస్తున్న పిల్లాడు.. ఆ పిల్లాడిని మానసిక వైద్యశాలలో పడేయడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. పిల్లల చుట్టు ఉండే ప్రపంచం, పరిస్థితులు వారిలో లేనిపోని భయాలని, నమ్మకాలని కలుగజేస్తాయని దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో దర్శకుడు చెప్పాలనుకున్నాడు. అది చెప్పటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ప్లస్ అయింది. పట్టణంలో జరిగే హత్యలని సాల్వ్ చేయడంలో పోలీసులు బిజీగా ఉండటం. హీరో, విలన్ గా ద్విపాత్రాభినయం చేసిన విశ్వ కార్తికేయ కథని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. హీరోయిన్ కి మాత్రం చాలా లిమిటెడ్ స్పేస్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకి నిడివి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అర్థం కాని సీన్లు, అనవసరమైన సీన్లు వస్తూనే ఉంటాయి. చెప్పడానికి చాలా కథ ఉన్నా .. కొన్ని నెమ్మదిగా సాగే సీన్లు కథని డిస్టబ్ చేశాయి. చివరి ముప్పై నిమిషాలు సినిమాకు బలం. కానీ అందులోనే క్లారిటీ మిస్ అయింది.
ట్విస్ట్ లు ఉన్నాయి.. కథనం బాగుంది.. కానీ అనవసరపు సీన్లు, సాంగ్స్ తీసేస్తే కథ ఇంకా గ్రిస్పింగ్ గా ఉండేది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. అందులో లిమిట్ కి మించి ఎక్స్ పోజింగ్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో కోర్ సీన్ వచ్చేటప్పుడు ఉంటుంది. అవి రెండు స్కిప్ చేస్తే చూసేయొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడే వారికి కొన్ని సన్నివేశాలు చూస్తే ఇవెక్కడో చూసామే అనే ఫీలింగ్ వస్తుంది. నాగశౌర్య మూవీ ఒకటి ఉంటుంది. అందులో కూడా ఇలాంటి కథనమే ఉంటుంది. కానీ ఇది కాస్త ఢిఫరెంట్ గా సాగుతుంది. అజయ్ అర్సాడ మ్యూజిక్ బాగుంది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ పర్వాలేదు. కానీ ప్రథమార్ధంలో కొన్ని సీన్లు తీసేస్తే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
విశ్వ కార్తికేయ నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. స్పెషల్ ఆఫీసర్ పులిగా చిత్ర శుక్లా ఆకట్టుకుంది. ఆయుషి పటేల్, దేవి ప్రసాద్, రూప లక్ష్మీ వారి పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా : ఫ్రెష్ కంటెంట్ బట్ లెంతీ. ఒకసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్ : 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |