![]() |
![]() |
.webp)
విశ్వం పుట్టినప్పటి నుంచే ఈ భూమ్మీద కళ వర్దిల్లుతూ ఉంది. ప్రకృతి దగ్గరనుంచి పసిపిల్లవాడు దాకా కళ కి దాసోహులే మహా సముద్రం లోతు అయినా కొలవచ్చు గాని కళ కి ఉన్న లోతు మాత్రం కొలవలేము.అదే విధంగా కళ ఎన్నో రూపాలలో కొలువై ఉంది. అంతటి కళకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చినీయాంశ మయ్యింది
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గీతం రాబోతుందన్న విషయం అందరకి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి (m.m keeravani)సంగీత సారధ్యంలోసదరు గీతం రూపాంతరం చెందుతుంది. పాట రికార్డింగ్ కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని కీరవాణి రికార్డింగ్ స్టూడియోకి వెళ్లారు. పాటని పూర్తిగా విన్నారు. కీరవాణి నే స్వయంగా పాడి వినిపించారు. పాట బాగుందని మెచ్చుకున్న సిఎం ఏమైనా మార్పులు చేర్పులు చెయ్యాలేమో అని మిగతా ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తున్నారు. సీఎం అయ్యి ఉండి కూడా రేవంతే స్వయంగా కీరవాణి స్టూడియో కూడా వెళ్లడం పట్ల కళ కి ఆయన ఇచ్చిన విలువ ఎంతో అర్ధమవుతుంది
.webp)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలకి ప్రత్యేక గీతం రావడం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంగీత శిఖరం, ప్రపంచ అవార్డు ఆస్కార్ విన్నర్ కీరవాణి తెలంగాణ పాటని ఎలా స్వరకల్పన చేసారో అనే ఆసక్తి తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు ప్రజల్లో కూడా ఉంది. ప్రముఖ సినీ ప్రజా కవి అందె శ్రీ (ande sri)కలం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక గీతం పురుడుపోసుకుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన జూన్ 2 న పాట ప్రజల్లోకి రానుంది
![]() |
![]() |