![]() |
![]() |

తన యాక్టింగ్ టాలెంట్ తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ క్రికెటర్స్, హాలీవుడ్ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. తాజాగా తారక్ గురించి.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని, నటుడిగానూ ఎంతో అభిమానిస్తానని కోహ్లీ తెలిపాడు. "కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ తో కలిసి ఒక యాడ్ లో నటించా. ఆ టైంలో ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఫిదా అయ్యా. ఆయన ఆప్యాయంగా మాట్లాడే తీరు నాకు నచ్చుతుంది. 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఇక ఆ సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ కి స్టెప్పులేస్తూ నేను, అనుష్క రీల్స్ కూడా చేశాం. లాస్ట్ ఇయర్ ఒక మ్యాచ్ ఆడుతున్న టైంలో 'నాటు నాటు' సాంగ్ కి ఆస్కార్ వచ్చిందని తెలిసి ఎంతో సంతోషించాను. స్పెషల్ అకేషన్స్ కి ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడుతుంటాను." అని విరాట్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం కోహ్లీ వరల్డ్ లోనే టాప్ క్రికెటర్ గా వెలుగొందుతున్నాడు. అలాంటి కోహ్లీ.. ఎన్టీఆర్ తనకు ఫ్రెండ్ అని, అతని యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పడంతో.. తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ గురించి విరాట్ చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
![]() |
![]() |