![]() |
![]() |

ప్రముఖ టాలీవుడ్ నటుడు తొట్టెంపూడి వేణు (Venu Thottempudi) పై కేసు నమోదైంది. బిజినెస్ విషయంలో వేణుతో పాటు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వహకులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని 'తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' ద్వారా.. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న 'ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ' ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. ఈ వర్క్ ని ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ నుండి.. బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. 2002లో పనులు మొదలు కాగా.. వారు చేసిన పనులకు రూ. 450 కోట్లను తెహ్రీ సంస్థ అందించింది. అందులో 5.5 శాతం ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ తీసుకొని.. 94.5 శాతం రిత్విక్ కన్‌స్రక్షన్స్ ఖాతాలో వేసింది. ఆ తర్వాత మిగిలిన పనులకు రూ.1010 కోట్లు విడుదల కాగా.. వాటా ఇవ్వకుండా రిత్విక్ ప్రాజెక్ట్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ రద్దు చేసుకుందట. ఉద్దేశపూర్వకంగా మోసం చేసి, మొత్తం డబ్బు తీసుకోవాలని చూస్తున్నారంటూ.. ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ పై రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు, తొట్టంపూడి వేణు సహా మొత్తం ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
![]() |
![]() |