![]() |
![]() |

మరో కొత్త సంచలనానికి ఇంకా నెలరోజులు సమయం ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ‘కల్కి 2898ఎడి’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల్ని థ్రిల్ చేయనుంది. ఈ సినిమాకి సంబంధించి వస్తున్న ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ‘బుజ్జి’ని పరిచయం చేసింది చిత్ర యూనిట్. దాని కోసం ఓ భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి ప్రేక్షకులకు, అభిమానులకు కనువిందు చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి మహామహులు ఈ సినిమాలో భాగం కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది.
ఇటీవల జరిగిన బుజ్జి, భైరవ ఈవెంట్లో విచిత్రంగా ఉండే వాహనం బుజ్జిని డ్రైవ్ చేస్తూ ప్రభాస్ అందర్నీ అలరించాడు. తాజాగా బుజ్జి వాహనాన్ని అక్కినేని నాగచైతన్య కూడా నడిపాడు. దాన్ని డ్రైవ్ చేసిన అనుభవాన్ని తెలియజేస్తూ.. తాను బుజ్జిని చూసి బాగా షాక్ అయ్యానని అన్నారు. బుజ్జిని తయారు చేయడం కోసం ఇంజనీరింగ్‌లో వున్న రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశారని చిత్ర యూనిట్‌ని ప్రశంసించారు. నాగచైతన్య.. బుజ్జిని డ్రైవ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్ర యూనిట్.
![]() |
![]() |