![]() |
![]() |

కొన్ని సినిమాల తీరు ఎలా ఉంటుందంటే..ఇండియన్ సినిమా గర్వించదగ్గ టెక్నీషియన్స్ పని చేస్తున్నా కూడా ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ ని జరుపుకుంటు ఉంటాయి. అలాంటి వాటిల్లో చరణ్ తేజ్ ఉప్పలపాటి మూవీ కూడా ఒకటి. ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ కి కజిన్ అవుతారు. నిఖిల్ హీరోగా వచ్చిన స్పై అండ్ సుమంత్ హీరోగా వచ్చిన మళ్ళీ మొదలయ్యింది సినిమాలకి వన్ ఆఫ్ ది నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కే దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు
ఒకప్పటి బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవా కాంబో లో ఒక చిత్రం తెరకెక్కుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారానే చరణ్ తేజ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. తెలుగులో డైరెక్టర్ గా ప్రూఫ్ అయిన తర్వాతే బాలీవుడ్ ఆఫర్ వస్తుంది ,కానీ ఒక్క సినిమా కూడా చెయ్యకుండా చరణ్ కి ఈ ఆఫర్ రావడం లక్ అనే చెప్పాలి. పైగా కాజోల్, ప్రభుదేవా లాంటి సీనియర్స్ ని మొదటి సినిమాకే డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఇది చాలా మంచి అవకాశం కూడా.ఇక ప్రభుదేవా,కాజోల్ కాంబో లో ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మెరుపుకలలు అనే మూవీ వచ్చింది.దీంతో ప్రేక్షకుల్లో ఆ జంట మీద క్యూరియాసిటీ ఏర్పడింది.మూవీ మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే టీజర్ రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ లాంటి స్టార్ కాస్టింగ్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది

అలాగే ఇండియన్ సినిమా గర్వించదగ్గ టాప్ టెక్నీషియన్స్ తమ తమ శాఖల్లో పని చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ లేటెస్ట్ హిట్ జవాన్ కి సినిమాటోగ్రాఫర్‌గా చేసిన జికె విష్ణు, అదే విధంగా లేటెస్ట్ సంచలనం యానిమల్ మూవీకి మ్యూజిక్ ని ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్, అల్లు అర్జున్ పుష్ప 2 ఎడిటర్ నవీన్ నూలి, మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్ లాంటి భారీ హిట్స్ మూవీస్ కి స్క్రీన్ ప్లే ని అందించిన నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా లు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు
![]() |
![]() |