![]() |
![]() |
ప్రస్తుతం టాలీవుడ్‌ని కుదిపేస్తున్న అంశం బెంగళూరు రేవ్ పార్టీ. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. శుక్రవారం ఒక వెబ్‌సిరీస్‌కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న మంచు లక్ష్మీని రేవ్ పార్టీ వ్యవహారంపై స్పందించాల్సిందిగా పాత్రికేయులు కోరగా దానికి తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు.
‘అసలు అక్కడ ఏం జరిగిందో తెలీదు.. ఇది సందర్భం కూడా కాదు. చాలా రోజుల తర్వాత ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ఎక్కడికో వెళ్లింది.. అంటే నాకేమిటి సంబంధం అండీ.. అది వారి సమస్య. నాది కాదు’ అంటూ స్పష్టం చేశారు మంచు లక్ష్మీ.
![]() |
![]() |