![]() |
![]() |

బెంగుళూర్ లో మొన్న ఆదివారం రేవ్ పార్టీ జరిగింది. అందులో పాల్గొన్న చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారని రుజవయ్యింది. వాళ్ళందరి రక్తనమూనాలని పరీక్షలకి పంపించగా సుమారు ఎనభై ఆరు మందికి పాజిటివ్ రిపోర్ట్ . వాళ్ళల్లో ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉంది. తాజాగా ఇంకో నటి పేరు కూడా బయటకి వచ్చింది
అషీ రాయ్(ashi roy) కె ఎస్ 100 , మిస్టరీ ఆఫ్ సారిక, లాక్ డౌన్, వైతరణి రానా లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని పొందింది. తను కూడా బెంగళూరు లో జరిగిన రేవ్ పార్టీ లో పాల్గొంది. డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.దీంతో ఇప్పుడు అషీ విషయం కూడా టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది
బెంగుళూర్ పార్టీ లో పాల్గొన్నది నిజమే కానీ డ్రగ్స్ తీసుకోలేదు. ఫ్రెండ్ పుట్టిన రోజు పార్టీ చేసుకుందామంటేనే వెళ్లానని రెండు రోజుల క్రితం అషీ రాయ్ చెప్పింది. ఇప్పుడు ఆమె కూడా డ్రగ్ తీసుకున్నటు రుజువయ్యింది.ఇప్పుడు ఈ సంఘటనలతో హేమ, అషీ రాయ్ ఘటనలతో టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే విధంగా ముందు ముందు ఎవరి పేర్లు బయటకొస్తాయో అనే టెన్షన్ అందరిలో ఉంది
![]() |
![]() |