![]() |
![]() |

ఒక వైపు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand mahindra).ఇంకో వైపు ప్రభాస్ (prabhas)కల్కి 2898 ఏడి (kalki 2898 ad)టీం.. ఇండియాలోనే కాకుండా చైనా, అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా వంటి దేశాల్లో కార్ల తయారీలో అగ్ర గామిగా ఉన్న రికార్డు మహీంద్రా ది. ఆరువందల కోట్ల బడ్జట్ తో ఇండియాలోనే ఇంతవరకు రాని సరికొత్త కాంబో తో తెరకెక్కతున్న రికార్డు కల్కి ది. మరి ఈ ఇద్దరకీ ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం
మొన్న కల్కి నుంచి బుజ్జి (bujji)పరిచయమైంది.బుజ్జి అంటే కారు.దాదాపు ఆరు టన్నుల బరువు ఉన్న బుజ్జిని తమిళనాడులోని కోయంబత్తూర్ లో తయారు చేశారు. ముందు రెండు టైర్లు, వెనుక ఒక టైరు మాత్రమే ఉన్న బుజ్జి విలువ సుమారు ఏడు కోట్లు. ఈ బుజ్జిని మహీంద్రా నే తయారుచేసింది.జయం మోటార్స్ సాయంతో అందర్నీ ఆకట్టుకునేలా డిజైన్ చేసారు.ఈ విషయంపైనే ఆనంద్ మహీంద్రా నాగ్ అశ్విన్ ని పొగుడుతు ట్వీట్ చేసాడు. నాగ్ అశ్విన్ (nag ashwin)అతడి టీం గొప్పగా ఆలోచించడానికి భయపడదు. వారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అధునాతన వాహనాలు తయారు చెయ్యడం లో కల్కి బృందానికి చెన్నై లోని మహేంద్ర రీసర్చ్ వ్యాలీ ఎంతగానో సహాయపడింది .బుజ్జి వాహనం రెండు మహింద్ర ఈ మోటార్లతో నడుస్తుంది. కలలు కనడం మాత్రం మానద్దు అంటు ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, నాగ్ అశ్విన్ కూడా అసాధ్యం అనుకున్న మా కలల్ని నిజం చేసారంటూ రిప్లయ్ ఇచ్చాడు.
.webp)
బుజ్జి పొడవు 6075 మిల్లీ మీటర్లు, వెడల్పు 3380 ,హైట్ 2186 మిల్లీ మీటర్లు, రిమ్ సైజ్ 34.5 ఇంచెస్ కాగా పవర్ 94Kw, బ్యాటరీ 47KWH.ఇక ప్రభాస్ కల్కి కోసం ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ సినీ ప్రేమికులందరు ఎంతోగానో వెయిట్ చేస్తున్నారు. అది ఎంతలా అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ మే లో కాకుండా తర్వాత జరుపోకోవచ్చుగా అనేంతలా. ఎందుకంటే మే 9 న కల్కి రిలీజ్ అవ్వాలసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే, దిశా పాటని వంటి స్టార్ క్యాస్ట్ జూన్ 27 న ప్రేక్షకులని మెస్మరైజ్ చేయనుంది. ఇన్ క్లూడింగ్ బుజ్జి కూడా
![]() |
![]() |