![]() |
![]() |

'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).. 'చందమామ'తో ఘన విజయాన్ని అందుకొని, క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'చందమామ'లో నవదీప్ కి జోడిగా కాజల్ నటించింది. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరించి. నవదీప్, కాజల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. 'చందమామ'లో రొమాన్స్ తో రెచ్చిపోయిన ఈ జోడి.. ఇప్పుడు బాక్సాఫీస్ వార్ కి దిగుతోంది.
కాజల్ టైటిల్ రోల్ పోషించిన 'సత్యభామ'(Satyabhama), నవదీప్ హీరోగా నటించిన 'లవ్ మౌళి' (Love Mouli) ఒకేరోజు విడుదల కానున్నాయి. జూన్ 7న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ చిత్రాల విజయం ఇద్దరికీ కీలకమే.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ జోరు ఈమధ్య బాగా తగ్గింది. పైగా 'సత్యభామ' అనేది ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో.. తన బ్రాండ్ తోనే వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇది హిట్ అయితే కాజల్ మళ్ళీ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యే అవకాశముంది.
నవదీప్ హీరోగా బాక్సాఫీస్ దగ్గర అలరించి చాలా కాలమే అవుతుంది. కొన్నేళ్లుగా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు పరిమితం అవుతూ వస్తున్న నవదీప్.. తనని తాను హీరోగా రీ లాంచ్ చేసుకుంటున్నట్లుగా 'లవ్ మౌళి'ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే మళ్ళీ నవదీప్ కి హీరోగా అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది.
మరి జూన్ 7న 'సత్యభామ', 'లవ్ మౌళి' మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
![]() |
![]() |