![]() |
![]() |

సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని కొన్ని కాంబినేషన్స్ చూడాలంటే ప్రేక్షకులు పెట్టి పుట్టాలి. ప్రెజంట్ సినీ వాతావరణాన్నిచూస్తుంటే ప్రేక్షకులుకి ఆ అదృష్టం దక్కేలా ఉంది. పైగా అది అలాంటి ఇలాంటి కాంబో కాదు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మొత్తం ఏక కాలంలో దద్దరిల్లే కాంబో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)అప్ కమింగ్ మూవీ పుష్ప 2 (pushpa 2) సుకుమార్ (sukumar)దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. పార్ట్ 1 హిట్ కావడంతో పార్ట్ టూ పై అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పుష్ప 2 ఎప్పటికప్పుడు సరికొత్త హంగులతో ముస్తాబవుతు వస్తుంది. మూవీ స్టార్ట్ అయినప్పుడే ఐటమ్ సాంగ్ ఉంటుందనే విషయం అందరకి తెలుసు. పార్ట్ 1 లో అయితే సమంత బన్నీ ల మధ్య వచ్చిన ఐటెం సాంగ్ ఒక రేంజ్ లో అదిరిపోయింది. పైగా సినిమా విజయంలో ఒక భాగం కూడా అయ్యిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంతో పార్ట్ 2 లో కూడా అంతకు మించి ఉండాలని ప్రేక్షకులు ఆశ పడుతున్నారు. వాళ్ళందరి ఆశలకి తగ్గట్టే యానిమల్ (animal) తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రి (Tripti Dimri) బన్నీ తో కలిసి ఐటెం సాంగ్ లో చిందులేయనుంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలతో ఇది కదా మాకు కావాల్సిందని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అంటున్నారు
.webp)
సుక్కు సినిమా అంటేనే ఐటెం సాంగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్. పైగా సాంగ్స్ అన్ని కూడా చిన్నా పెద్దా అనే తారతమ్యం మరచి సిల్వర్ స్క్రీన్ దగ్గరకి వెళ్లి డాన్సులు చేసేలా చేస్తాయి. పైగా ఐటెం సాంగ్ లో చేసే భామలు కూడా ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు కలిగిస్తాయి. అసలుకే ఇప్పుడు ఇండియా మొత్తం త్రిప్తి నామధేయంతో చలి కాచుకుంటుంది. రేపు పుష్ప 2 తర్వాత ఆ చలి తీరం దాటడం ఖాయం. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సాంగ్స్ తెరకెక్కుతున్నాయి. ఆయన కూడా ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, ఫహాద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
![]() |
![]() |