![]() |
![]() |
.webp)
కొన్ని సినిమాలు కంటెంట్ ఉన్నా సరైన పబ్లిసిటీ లేక యావరేజ్ టాక్ ని తెచ్చుకుంటాయి. కానీ అవే ఏదైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ రిలీజైతే మంచి వ్యూస్ వస్తాయి. అలా అండర్ రేటెడ్ గా ఉన్న ఓ సినిమా అటు ఓటీటీనీ ఇటు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.
శంకర్ గురు రచయితగా, దర్శకుడిగా.. డాలి ధనంజయ హీరోగా, అమృత అయ్యంగారు హీరోయిన్ గా నటించిన మూవీ ' బడవ రాస్కెల్ '. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. శంకర్ అలియాస్ బడవ రాస్కెల్ గా డాలి ధనంజయ, సంగీతగా అమృత అయ్యంగారు, శంకర్ వాళ్ళ నాన్న రంగనాథ్ గా రంగాయన రఘు, శంకర్ వాళ్ళ అమ్మ శారదమ్మగా తార, శంకర్ క్లోజ్ ఫ్రెండ్ గా నాగలింగ, సంగీత వాళ్ళ అమ్మ ప్రేమకూమారిగా స్పర్శ రేఖ నటించారు. శంకర్ గురు రాసుకున్న ఈ కథ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. టైలాగ్స్ సినిమాకి ప్రధానబలంగా నిలిచాయి. అమ్మనాన్నల ప్రేమని కొడుకులు అర్థం చేసుకుంటారా? ప్రేయసి ప్రేమని వద్దంటే ఆ ప్రేమికుడికి బాధ ఎలా ఉంటుంది? స్నేహితుల కోసం ప్రాణాలిచ్చేవాడు ఉంటే ఎలా ఉంటుంది.. లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ బడవ రాస్కెల్ ఉంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
రోడ్డు పక్కన ఇద్దరు ముసలి భార్యాభర్తలు ఓ చిన్న హోటల్ ని పెట్టుకుంటారు. అయితే అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చి వారిని ఆ స్థలం ఖాళీ చేసి వెళ్ళమని లేదంటే బాగోదని బెదిరిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన శంకర్(డాలి ధనంజయ) రౌడీలని కొట్టి వారిని సేవ్ చేస్తాడు. అయితే ఓ రౌడీ తిరిగి వచ్చి శంకర్ తలమీద బలంగా కొట్టి ఓ పాతబడ్డ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడు. అక్కడ అప్పటికే కొంతమందిని తీసుకొస్తారు ఆ రౌడీలు. ఇక ఒక్కొక్కరు తమ ఫ్యామిలీ గురించి ప్రేమకథ గురించి చెప్తారు. శంకర్ ని సంగీత నమ్మించి మోసం చేసిందని.. తన అమ్మనాన్నలైనటువంటి రంగనాథ్, శారదమ్మలని దారుణంగా అవమానించారని చెప్తుంటాడు. అసలు శంకర్ ని ప్రేమించిన సంగీత ఎందుకలా చేసింది? సంగీత వాళ్ళ అమ్మ ప్రేమకూమారి పాత్రేంటి? శంకర్ యొక్క అమ్మనాన్నలు ఏం చేశారనేది మిగతా కథ. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఫ్యామిలీతో కలసి చూసేలా ఉంది. గత సంవత్సరం కన్నడలో రిలీజైన ఈ సినిమా సరైన పబ్లిసిటీ లేక అయిదు నెలల క్రితమే యూట్యూబ్ లోకి వచ్చేసింది. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంతసేపు హీరో స్థానంలో తనని తాను చూసుకుంటాడు. డాలి ధనంజయ వాయిస్ సినిమాకి ప్లస్ అయింది. శంకర్ యొక్క అమ్మనాన్నలు, ఫ్రెండ్స్, లవర్, ఇలా ప్రతీ ఒక్కరు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా పూర్తిగా చూస్తే ప్రతీ ఫ్యామిలీలో నాన్న పడే కష్టం, అమ్మ చేస్తున్న త్యాగం తెలుస్తుంది. డబ్బులు పెట్టి కంటెంట్ లేని వాటిని చూసేకంటే ఇంట్లోనే యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాని హ్యాపీగా చూసేయ్యండి.
![]() |
![]() |