![]() |
![]() |
.webp)
డైలీ వినిపించే సినిమా వార్తల్లో చిరంజీవి (chiranjeevi) సినిమాకి సంబంధించిన న్యూస్ ఉంటే ఆ కిక్కే వేరు. నాలుగు దశాబ్దాల నుంచి ఫ్యాన్స్ ఆ కిక్ ని అనుభవిస్తూనే ఉన్నారు. కాకపోతే కొన్ని రోజుల నుంచి అలాంటి వాతావరణం లేకపోవంతో కొంచం డల్ అయ్యారు. లేటెస్ట్ గా ఒక వార్త వచ్చి వాళ్ళల్లో ఆనందాన్ని తెచ్చింది
విశ్వంభర(vishwambhara)మెగాస్టార్ అప్ కమింగ్ మూవీ. కళ్యాణ్ రామ్ బింబిసార (bimbisaara)ని తెరకెక్కించిన వశిష్ఠ దర్శకుడు. త్రిష ఒక హీరోయిన్ గా చేస్తుంది. కొన్ని రోజుల క్రితం త్రిష కి సంబంధించిన సన్నివేశాలని కూడా తెరకెక్కించారు. చిరు కూడా అందులో పాల్గొన్నాడు. ఇక మూవీలో చిరంజీవి అక్కయ్య క్యారక్టర్ ఒకటి ఉంది. కథ కి ఆ క్యారక్టర్ చాలా ముఖ్యమైనది కూడా ఒకప్పటి టాప్ హీరోయిన్ కుష్బూ ఆ పాత్రలో కనపడబోతుంది. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది. ఈ వార్తతో చిరు అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా పదిహేడు ఏళ్ళు వెనక్కి వెళ్లారు

చిరు అండ్ కుష్బూ (kushboo)లో కలిసి స్టాలిన్ లో నటించారు.పైగా అక్కాతమ్ముడి గానే అందులో నటించారు.ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ కూడా సూపర్ గా ఉంటుంది. నిజమైన అక్కా తమ్ముడు ని చూస్తున్నామనే స్థాయిలో నటించారు. దాంతో విశ్వంభర మీద అంచనాలు మరింత పెరిగాయి. కొన్ని రోజుల క్రితం సీనియర్ నటి విజయశాంతి ని విశ్వంభర కోసం అడిగారు. కానీ ఆమె నో చెప్పింది. మరి ఆ క్యారక్టర్ లోనే కుష్బూ చేస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.కొంత మంది మాత్రం విజయశాంతి ని అక్క క్యారక్టర్ కి అడిగి ఉండరని అంటున్నారు. ఎందుకంటే చిరు, విజయశాంతి లు జంటగా సిల్వర్ స్క్రీన్ మీద ఎన్నో రికార్డు లు సృష్టించారు. పైగా ఆ ఇద్దరి ఫెయిర్ ప్రేక్షకుల దృష్టిలో చాలా బలంగా నాటుకు పోయిందని అంటున్నారు. 2025 జనవరి 10 న విశ్వంభర విడుదల అవుతుంది. యువి క్రియేషన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయిదుగురు తోబుట్టువులకు అన్నయ్యగా భీమవరం దొరబాబు పేరుతో చిరంజీవి కనిపిస్తున్నారనే టాక్ అయితే సినీ సర్కిల్స్ లో వినబడుతుంది
![]() |
![]() |