![]() |
![]() |

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'SSMB 29'. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా ఇది. పైగా 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లకుండానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా చాలని ఎదురుచూస్తున్న వారు ఎందరో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ గురించి కొన్ని గాసిప్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ కీలక ప్రకటన చేశారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న 'SSMB 29' చిత్రానికి కాస్టింగ్ డైరెక్టర్ గా విరేన్ స్వామి వర్క్ చేస్తున్నట్లు ఇటీవల నేషనల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. 'SSMB 29'లో మహేష్ బాబు పాత్రకి సమానంగా ఓ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర ఉంటుందని, ఆ పాత్రతో పాటు కొన్ని ఇతర కీలక పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసే బాధ్యతను విరేన్ స్వామికి అప్పగించినట్లు కొందరు రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలకు మేకర్స్ చెక్ పెట్టారు. 'SSMB 29' సినిమాకి విరేన్ స్వామి పని చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తమ నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే పట్టించుకోవాలని మేకర్స్ పేర్కొన్నారు.
![]() |
![]() |