![]() |
![]() |

నిర్మాతలు మాములు వాళ్ళు కాదు. వాళ్ళని అసలు నమ్మకూడదు. తమ సినిమా ప్రమోషన్స్ కోసమే అదంతా సృష్టించే వాళ్ళు. ఇపుడు ఈ మాటలన్నీ చెప్తుంది ఎవరో కాదు. 2000 వ సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అందాల భామ సోనాలి బింద్రే
సోనాలి బింద్రే కి 2002 లో గోల్డి బెహ్ల్ తో వివాహం జరిగింది. ఇక అప్పటినుంచి సినిమాల్లో చెయ్యడం తగ్గించింది. మళ్ళీ 2022 లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 అనే వెబ్ మూవీలో నటిస్తుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ లో సోనాలి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. 1994 లో ఇండస్ట్రీ లోకి వచ్చాను. ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితులు కొంచం భిన్నంగా ఉండేవి . నా సహనటులతో నాకు ఎఫైర్ ఉందనే రూమర్స్ వచ్చేవి. పైగా ఆ రూమర్స్ సృష్టించేది ఎవరో కాదు నా నిర్మాతలే. సినిమా ప్రమోషన్స్ కోసమే వాళ్ళు అలా సృష్టించే వాళ్ళు. పైగా మీడియాకి కూడా వెల్లడించేవాళ్లు. మొదట్లో ఈ విషయం నాకు తెలిసేది కాదు. తర్వాత అర్ధమయ్యి షాక్ కి గురయ్యాను.అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లల్లో సన్నగా ఉండే దాన్ని. దాంతో చాలా మంది నన్ను అవహేళన చేసేవారు. మిగతా హీరోయిన్లు బొద్దుగా ఉన్నారని నిర్మాతలు కూడా కామెంట్స్ చేసే వాళ్ళని చెప్పుకొచ్చింది .అలాగే ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు. డాన్స్ అండ్ యాక్టింగ్ కి ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. సినిమాల్లోకి వచ్చాకే నేర్చుకున్నానని కూడా చెప్పింది.
1994 లో వచ్చిన ఆగ్ ఆమె మొదటి సినిమా. నిజానికి ఆ సినిమాలో హీరోయిన్ దివ్య భారతి. ఆమె ఆకస్మిక మరణంతో సోనాలికి హీరోయిన్ గా అవకాశం వచ్చింది.చిరంజీవి, మహేష్ బాబు ,నాగార్జున,బాలకృష్ణ వంటి టాప్ స్టార్ తో కలిసి నటించిన సోనాలి ఆల్ లాంగ్వేజెస్ కలుపుకొని 45 చిత్రాలకి పైనే చేసింది
![]() |
![]() |