![]() |
![]() |

క్యారక్టర్ ఆర్టిస్ట్ కి కూడా స్టార్ డం తెచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్. పాత్ర ఏదైనా సరే రఫ్ ఆడించడం ఆమె నైజం. తను ఉన్న సినిమా ఖచ్చితంగా బాగుంటుందనే ఆలోచనని కూడా ప్రేక్షకుల్లో కలిగించింది.పేరుకే తమిళ నటి. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెలుగు నటే అని అంటారు. అంతలా అభిమానాన్ని పొందింది. తాజాగా తనకి ఎదురైన క్యాస్టింగ్ అనుభవం గురించి చెప్పింది
ఇండస్ట్రీలో ఏ చిన్న సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా చాలు. ఆ తర్వాత దూసుకుపోవచ్చని అంటారు. అలాంటిది వరలక్ష్మిది మాములు బ్యాక్ గ్రౌండా. తండ్రి శరత్ కుమార్ తమిళనాట బడా స్టార్. కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక పొలిటికల్ పార్టీని కూడా స్థాపించాడంటే ఆయన రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ వరలక్ష్మి కూడా క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంది. ఒక ప్రముఖ టెలివిజన్ ఛానెల్ హెడ్ ఒక సినిమా విషయమై తనతో మాట్లాడేందుకు వచ్చాడు.డిస్కర్షన్ ముగిశాక మనం మళ్లీ బయట కలుద్దామని చెప్పాడు.ఎందుకని అడిగితే వేరే పని కోసం అన్నాడు. రూం కూడా బుక్ చేస్తానని చెప్పాడు. అప్పుడు గాని వరలక్ష్మి కి విషయం అర్ధం కాలేదు. పైగా అతను వరలక్ష్మి ఇంటిలోనే ఆ విధంగా మాట్లాడాడు.దాంతో సదరు వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.ఆ తర్వాత ఛానల్ కూడా అతన్ని తీసేసింది
ఇండస్ట్రీలో తనకు ఇదొక్కటే చేదు అనుభవం కాదు. కమిట్ మెంట్ కి ఒప్పుకోలేదని కొన్ని సినిమాల నుంచి కూడా తప్పించారు. అయినా సరే క్యారెక్టరే ముఖ్యం అని భావించి నేడు టాప్ స్టార్ గా వెలుగొందుతుంది.పైగా వేరే అమ్మాయిలతో ఇండస్ట్రీ జనాలు ఎలా వ్యవహరిస్తారో అర్ధం చేసుకొని శక్తి పేరుతో ఒక ఎన్జీవో పెట్టి ఇండస్ట్రీలో మహిళలకు అండగా నిలుస్తుంది. ప్రస్తుతం శబరి అనే మూవీ తో థియేటర్ లలో ఉంది. ఇటీవలే ముంబైకి చెందిన నీకొలాయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. క్రాక్, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పిఎస్, హనుమాన్ లాంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
![]() |
![]() |