![]() |
![]() |

దర్శకుడు సుకుమార్(Sukumar) ఎంతటి ప్రతిభావంతుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కుటుంబం నుంచి మరో ప్రతిభ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి.. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో సత్తా చాటింది.
తాజాగా జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి అవార్డు అందుకుంది. సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పద్మావతి దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సత్తా చాటి, ప్రశంసలు అందుకున్న 'గాంధీ తాత చెట్టు' చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

![]() |
![]() |