Home

»

Latest News

ప్రభాస్, ఎన్టీఆర్.. ఎందుకీ గందరగోళం!

May 1, 2024 3:23PM

పాన్ ఇండియా హీరోలు ప్రభాస్(Prabhas), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) సినిమాల విషయంలో గందరగోళం నెలకొంది. ఇద్దరి సినిమాల్లో ముందుగా ఏది మొదలవుతుందో తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఈ గందరగోళానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పవచ్చు.

గతేడాది డిసెంబర్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన 'సలార్' సినిమా విడుదలైంది. అలాగే వీరి కాంబోలో 'సలార్-2'(Salaar 2) రావాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ తోనూ ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా మొదలవుతుంది అనేది పెద్ద సస్పెన్స్ లా మారింది.

కొందరు 'సలార్-2' ఈ నెలలోనే ప్రారంభం కానుందని, ఇది పూర్తయ్యాక వచ్చే ఏడాది ఎన్టీఆర్-నీల్ (NTR Neel) ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం అసలు ఇప్పట్లో 'సలార్-2' ఉండదని చెబుతున్నారు. 'కల్కి 2898 AD' విడుదల తర్వాత ప్రభాస్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడని, అనంతరం 'స్పిరిట్', 'కల్కి 2', 'రాజాసాబ్' పూర్తి చేసి.. అప్పుడు 'సలార్ 2'పై దృష్టి పెడతాడని అంటున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్-నీల్ మూవీ అక్టోబర్ లేదా నవంబర్ నుంచి స్టార్ట్ కానుందని చెబుతున్నారు. 

దీంతో 'సలార్-2', ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లలో ఏది ముందు మొదలవుతుంది అనేది పెద్ద సస్పెన్స్ లా మారిపోయింది. ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com