![]() |
![]() |
.webp)
ఇళయరాజా అంటే తెలియని దక్షిణ భారతీయ సినీ ప్రేమికుడు లేడు. సంగీత ప్రపంచంలో ఎన్ని రాగాలు ఉంటాయో వాటన్నింటిలోను అవలీలగా స్వరాలు సమకూర్చగల సంగీత మేధావి. ఆయన స్వరపరచిన పాటని పామరులు సైతం నోటితో హమ్ చెయ్యవచ్చు.అంతటి సంగీత జ్ఞానీ గత కొంత కాలంగా సంచలనాల జ్ఞానీ గా మారాడు. తాజాగా ఇంకో సంచలనాన్ని తన ఖాతాలో భద్రపర్చుకున్నాడు
రజనీకాంత్ తో కూలీ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ కి ఇళయరాజా కోర్ట్ నోటీసులు పంపాడు. ఇటీవల కూలీ టీజర్ రిలీజ్ అయ్యింది.బంగారం స్మగ్లింగ్ చేసే డెన్ లోకి రజనీ అడుగుపెట్టి అందర్నీ తుక్కు తుక్కుగా కొడతాడు.ఇక గతంలో ఇళయరాజా స్వరపరిచిన తంగ మగన్ లోని వా వా పక్కం వా పాటను టీజర్ లో ఉపయోగించారు. దీంతో తన అనుమతి లేకుండా తన పాటని ఉపయోగించారంటు సన్ పిక్చర్స్‌కు ఇళయరాజా నోటీసులు పంపించాడు. మ్యూజిక్ కి కాపీ రైట్ ని చెల్లించాలి.లేదా టీజర్ నుంచి తన పాటని తొలగించాలని కూడా నోటీసులో పేర్కొన్నాడు.చివరిగా ఇందులో కొసమెరుపు ఏంటంటే తంగ మగన్ లో రజనీ నే హీరో. సిల్క్ స్మిత, రజనీ మీద ఆ పాట తెరకెక్కింది

ఇళయ రాజా గతంలో అమర గాయకుడు దివంగత బాలసుబ్రమణ్యం గారు తన అనుమతి లేకుండా పాటలు పాడాడని కూడా కేసు వేసాడు. పాటలు కేవలం స్వర కర్త సొంతం అనేది ఇళయరాజా అభిప్రాయం. మరి ఇప్పుడు కూలీ విషయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రజనీ కాంత్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. కూలీ కి లోకేష్ కనగరాజ్ దర్శకుడు కాగా అనిరుద్ మ్యూజిక్ ని అందించాడు. రజనీ కెరీర్ లో 171 వ సినిమా
![]() |
![]() |