![]() |
![]() |

కారణాలు తెలియదు గాని బాహుబలి సిరీస్ తర్వాత అనుష్క సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా మెరవలేదు. తన స్పీడ్ తగ్గిందో లేక తనే స్పీడ్ తగ్గించుకుందో తెలియదు. సినీ సర్కిల్స్ లో మాత్రం కథ నచ్చకే సినిమాలు చెయ్యటం లేదనే టాక్ వినపడుతుంది. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఆమెకి సంబంధించిన పోస్టర్ ఒకటి వైరల్ అవుతుంది.
అనుష్క ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఆల్రెడీ అవి షూటింగ్ ని కూడా జరుపుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి మలయాళ మూవీ కదనార్ కాగా రెండోది ఘాటీ అనే తెలుగు మూవీ. వెరైటీ టైటిల్ తో కూడిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా ప్రారంభం అయ్యింది. ఇప్పటికే సగ భాగం షూటింగ్ కంప్లీట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీలోని అనుష్క లుక్ కి సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. పెద్ద వయసు ఆడవాళ్లు కట్టుకునే చీరని ధరించిన అనుష్క నెత్తిన ముసుగు వేసుకొని ఎక్కడికో వెళ్తుంది.కాకపోతే ఫేస్ ని రివీల్ చెయ్యలేదు.ఇదంతా పబ్లిసిటీ లో భాగం అని తెలుస్తుంది. కానీ పిక్ ని చూస్తుంటే మాత్రం ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి.
.webp)
అన్యాయానికి గురైన ఒక సాధారణ మహిళ న్యాయం కోసం ఎలా పోరాడింది అనే పాయింట్ తో ఘాటీ తెరకెక్కబోతుంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే మూవీ మొత్తం 60 సంవత్సరాల వయసున్న మహిళగానే అనుష్క కనిపించబోతుందనిన కూడా అంటున్నారు. గతంలో బాహుబలి లో కూడా వయసు పైబడిన పాత్రలో కనిపించింది. ఆ క్యారక్టర్ కి ప్రేక్షకులనుంచి ప్రశంసలు కూడా దక్కాయి. క్రిష్ అండ్ అనుష్క కాంబో లో గతంలో వేదం వచ్చి సంచలన విజయం సాధించింది.దీంతో ఘాటీ పై అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |