![]() |
![]() |
.webp)
'కల్కి 2898 AD'(Kalki 2898 AD) సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేతిలో.. ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. మారుతీ డైరెక్షన్ లో 'ది రాజా సాబ్'(The Raja Saab), ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్-2'(Salaar 2), అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్'(Spirit) కమిట్ అయ్యి ఉన్నాడు. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు హను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రీసెంట్ గా ఎన్ఐటీ వరంగల్ లో జరిగిన ఓ ఈవెంట్ కి హాజరైన హను(Hanu Raghavapudi).. ప్రభాస్ తో తాను సినిమా చేయనున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అలాగే ఇది చారిత్రక అంశాలతో రూపొందే పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ అని తెలిపాడు. అంతేకాదు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు ట్యూన్స్ కూడా ఇచ్చారని హను చెప్పాడు.
ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. 300 ఏళ్ళ క్రితం జరిగిన ఓ పవర్ ఫుల్ కథలో ఈ చిత్రం రూపొందనుందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తయిందని అంటున్నారు. నిజానికి 'కల్కి' విడుదల తర్వాత 'రాజా సాబ్' సినిమాతో పాటు.. ఈ చిత్రాన్ని సమాంతరంగా షూట్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ ప్రభాస్ ముందుగా 'సలార్-2'ని పూర్తి చేయాలని నిర్ణయించుకోవడంతో.. హను ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించనుందని సమాచారం. 'కల్కి'ని మించి ఈ ప్రాజెక్ట్ అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
![]() |
![]() |