![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (prabhas) మొన్నీ ఈ మధ్య సలార్ (salaar)తో అదిరిపోయే హిట్ కొట్టాడు. హిట్ కొట్టడమే కాకుండా తన కట్ అవుట్ కున్న పవర్ ని కూడా చాటి చెప్పాడు.సుమారు 650 కోట్ల రూపాయిలకి పైనే సాధించాడు. దీంతో తన అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏ.డి (kalki 2898 ad)మీద అందరిలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. మే 9 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా కల్కి గురించి వస్తున్న ఒక న్యూస్ ఇప్పుడు ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా నిలిచింది.
విశ్వ కథానాయకులు కమల్ హాసన్ (kamal haasaan)అండ్ అమితాబచ్చన్( amitabh bachchan) లు కల్కి లో నటిస్తున్న విషయం అందరకి తెలిసిందే. అయితే వీళ్లిద్దరు ఎలాంటి క్యారక్టర్ లో కనిపించబోతున్నారనే విషయాన్నిమాత్రం మేకర్స్ వెల్లడి చెయ్యలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కమల్ విలన్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఇండియన్ సినిమాని ఒక ఊపుతుంది. ఒక వేళ అదే కనుక నిజం అయితే సిల్వర్ స్క్రీన్ కి పండగే అని చెప్పవచ్చు. ప్రేక్షకులు కూడా కమల్ లోని సరికొత్త నట విన్యాసాన్ని చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొన్ని కాంబినేషన్ లు కూడా ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యబోతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి( rajamouli)ఒక ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో జక్కన్న ఎలాంటి క్యారక్టర్ లో కనిపించబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలోను ఏర్పడింది. ప్రభాస్ కి జక్కన్న కి మధ్య ఉన్న బాండింగ్ దృష్ట్యా ఇప్పడు ఈ వార్త క్రేజీగా మారింది.అలాగే నాచురల్ స్టార్ నాని(nani) కూడా కొద్దీ సేపు మెరవబోతున్నాడని అంటున్నారు. ఈ ఇద్దరితో పాటు ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ramgopal varma)కూడా ఒక డిఫరెంట్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్త వస్తుంది. ఈ ముగ్గురుతో పాటు ఇంకో ప్రముఖ హీరో కూడా అతిధి పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది.
ఇన్ని ప్రత్యేకతలని నింపుకున్న కల్కి లో ప్రభాస్ సరసన దీపికా పదుకునే (deepika padukune) హీరోయిన్ గా చేస్తుంది. అలాగే ఇంకో ప్రముఖ హీరోయిన్ దిశాపటాని (disha patani) ఒక ప్రత్యేక గీతంలో తళుక్కుమననుంది. భారీ చిత్రాల నిర్మాత అశ్వనీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ (nag ashwin) దర్శకత్వాన్ని వహించాడు. ఇక రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ కల్కి ప్రమోషన్స్ మరికొద్ది రోజుల్లో ఊపందుకోనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ మూవీకి జరగని విధంగా ప్రమోషన్స్ జరగబోతున్నాయనీ తెలుస్తుంది. మరి మే 13 న ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కల్కి వాయిదా పడుతుందా లేక అనుకున్న డేట్ కే వస్తుందా అనేది చూడాలి.
![]() |
![]() |