![]() |
![]() |

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు' సినిమా 2022 లో విడుదలై ఘన విజయం సాధించింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదానికి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువతను ఈ సినిమా ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తోంది. అయితే ఈ సీక్వెల్ రన్ టైం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
'డీజే టిల్లు'కి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కాగా, యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాకి సెన్సార్ టాక్ పాజిటివ్ గానే వచ్చింది. అయితే ఇప్పుడు నిడివే ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ రన్ టైం రెండు గంటలు కూడా లేదు. 1 గంట 58 నిమిషాల క్రిస్పీ రన్ టైం లాక్ చేశారట. 'డీజే టిల్లు' నిడివి కూడా 2 గంటల 4 నిమిషాలే కాగా, ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' నిడివి దానికంటే 6 నిమిషాలు తక్కువ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి పాటలు స్వర పరచగా.. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించాడు.
![]() |
![]() |