![]() |
![]() |
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందే చిత్రం బుధవారం ఉదయం గం.10.10లకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వెంకటసతీష్ కిలారు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తారు.
ప్రస్తుతం శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని చేస్తున్న రామ్‌చరణ్ తన నెక్స్‌ట్ మూవీని ‘ఉప్పెన’ దర్శకుడు సానా బుచ్చిబాబుతో చేయబోతున్నానని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్ నటించే 16వ చిత్రంగా ఇది రూపొందనుంది. రామ్‌చరణ్ సినిమాకి మొదటి సారి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించడం ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం.
![]() |
![]() |