![]() |
![]() |
2002లో మలయాళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫహద్ ఫాసిల్ తర్వాత హీరోగా, సహాయ నటుడిగా 50 సినిమాలకుపైగా నటించాడు. అంతేకాదు, నిర్మాతగా, సహనిర్మాత కొన్ని సినిమాలను కూడా నిర్మించాడు. 2021లో వచ్చిన ‘పుష్ప’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫహద్ పాన్ ఇండియా లెవల్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘విక్రమ్’ చిత్రంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. సౌత్ ఇండియాలో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో ఫహద్ కూడా ఒకరు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలుగులో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ, శోభు యార్లగడ్డ నిర్మాణంలో రెండు ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు. ఓ చిత్రానికి మేకర్స్ ‘ఆక్సిజెన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని పెట్టి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. మరో సినిమాకి నందమూరి బాలకృష్ణ ఫేమస్ డైలాగ్ అయిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అంటూ ఒక ఫాంటసీ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో ఫహద్ ఫాజిల్ ఓ చిన్నారితో పోలీస్ కార్‌పై ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తారు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘ఆక్సిజన్’ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకత్వం వహిస్తారు. ఈ రెండు సినిమాల్లో ఫహద్ ఫాసిల్ హీరోగా నటించడం, అతనితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.
![]() |
![]() |