![]() |
![]() |

ఆ మూవీలో స్టార్ హీరో లేడు. కనీసం స్టార్ కాస్ట్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ మూవీ ఇండియా వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తుంది. సృష్టించడమే కాదు నంబర్ వన్ ప్లస్ లో కూడా నిలిచింది. దీంతో సౌత్ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా షేక్ అవుతుంది.
మంజు మెల్ బాయ్స్ .గత నెల 29 న మలయాళం తో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని సాధించింది. పైగా కేవలం 25 రోజుల్లోనే ఆ స్థాయి కలెక్షన్స్ ని సాధించి తన సత్తా చాటుతుంది.దీంతో టోటల్ మలయాళ చిత్ర పరిశ్రమలోనే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన ఫస్ట్ మూవీగా మంజు మెల్ బాయ్స్ నిలిచింది. ఆ తర్వాత స్థానంలో 180 కోట్లు సాధించి 2018 మూవీ నిలిచింది. మోహన్ లాల్ మన్యం పులి ,లూసిఫర్ లు 150 ,130 కోట్లు సాధించి మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. రీసెంట్ సంచలనం ప్రేమలు 120 కోట్లతో ఐదవ స్థానంలో ఉంది.

2006 కేరళలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా మంజుమెల్ బాయ్స్ తెరకెక్కింది. కేరళకి చెందిన కొందరు యువకులు తమిళనాడు విహార యాత్రలకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు.అందులో భాగంగా గుణ గుహాలకి వెళ్తారు. ఆ తర్వాత అందులోని ఒక యువకుడు గుణ గుహల్లో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మంజు మెల్ బాయ్స్ చిత్ర కథ.చిదంబరం రచనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని ఈ నెల 29 న మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేయబోతుంది.
![]() |
![]() |