![]() |
![]() |

మూవీ : మర్డర్ ముబారక్
నటీనటులు : పంకజ్ త్రిపాఠి, సారా అలీఖాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్ తదితరులు
ఎడిటింగ్: అక్షర ప్రభాకర్
మ్యూజిక్ : సచిన్ జిగర్
సినిమాటోగ్రఫీ: లినేష్ దేశాయ్
నిర్మాతలు: దినేష్ విజన్
దర్శకత్వం: హోమీ అడజానియా
సారా అలీఖాన్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మర్డర్ ముబారక్'.. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం..
కథ:-
దేశ రాజధాని ఢిల్లిలోని ఓ ప్రాంతంలో గల 'ఢిల్లీ రాయల్ క్లబ్' లో అందరు సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా ఓ చిన్నపాప ఓ పరదా వెనకాల ఉన్న డెడ్ బాడీని చూసి గట్టిగా అరుస్తుంది. ఆ చనిపోయింది ఎవరనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏసీపీ భవాని శంకర్ (పంకజ్ త్రిపాఠి) వస్తాడు. అక్కడ చనిపోయింది జుంబా ట్రైనర్ లియో అని తెలసుకున్న ఏసీపీ భవాని శంకర్ తన ఇన్వెస్టిగేషన్ స్లోగా స్టార్ట్ చేస్తాడు. ఆ క్లబ్ లోని మెంబర్స్ ని ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆ క్లబ్ లోని కిచెన్ ఏరియాలో ఓ బాడీ అస్థిపంజరం ( స్కెల్టన్) లభిస్తుంది. అది ఎవరిదని ఫోరెన్సిక్ చేపిస్తాడు ఏసీపి భవాని శంకర్. అయితే అందులో కొన్ని నిజాలు బయటకొస్తాయి. మరి భవాని శంకర్ ఇన్వెస్టిగేషన్ లో లియోని చంపిందెవరో కనిపెట్టాడా? ఆ అస్థిపంజరానికి క్లబ్ లో వాళ్ళకి గల రిలేషన్ ఏంటో తెలిసిందా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:-
క్లబ్ లో హ్యాపీగా సాగుతున్న పార్టీలో డెడ్ బాడీ లభించడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఇక భవాని శంకర్ ఇన్వెస్టిగేషన్ తో కథ నత్తనడకన సాగుతుంది. ఒక్కొక్క క్యారెక్టర్ పరిచయానికే నలభై నిమిషాలు తీసుకున్నాడు డైరెక్టర్. ఇంకా సినిమా మరో నలభై నిమిషాల్లో ముగుస్తుందనగా కథలో కీలక మలుపులు వస్తుంటాయి.
ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే కేసు ఇన్వెస్టిగేషన్ అంటే ప్రతీసారీ ఇంట్రస్ట్ ఉంటుంది. కానీ సరైన విధంగా తీయకపోతే అది అంతగా మెప్పించదు. ఈ కథలో ట్విస్ట్ లు థ్రిల్స్ ఉన్నాయి కానీ అవన్నింటిని చివరి నిమిషాల్లో చూపించాలనుకోవడమే దర్శకుడు చేసిన పెద్ద లోపం.. గంట నలభై నిమిషాల సినిమాలో అంతా గందరగోళమే ఉంటుంది. ఏదీ ఓ కొలిక్కి రాదు.
అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీతో కలిసి చూడలేము. ఎంత ధనమున్న మనిషికి ఉండే ఆశ ప్రతీ ఒక్కరిని మోసం చేయడానికి, తప్పు చేయడానికి ప్రోత్సహిస్తుంది. అదే ఓ క్రైమ్ కి దారితీస్తుందనేది నిజం. దానిని చెప్పడానికి దర్శకుడు చివరి ఇరవై నిమిషాలు మాత్రమే తీసుకోవడం మిగతాదంతా స్లోగా సాగే కథనం ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ కి కామెడీ టచ్ ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా సాగదు. ఆ ఇన్వెస్టిగేషన్ చూసే ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోతారు.
స్టార్స్ ఉండటంతో ఈ మూవీ మీద అంచనాలు ఎక్కువ అవ్వడం కూడా పెద్ద మైనస్ గా మారింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చివరి నలభై నిమిషాలు బాగుంది. క్యారెక్టర్ ల పరిచయానికి ఓ పది నిమిషాలు తోసుకొని గంటన్నరలో కథ ముగించి ఉంటే ఈ మూవీ కల్ట్ క్లాసిక్ అయ్యేది. లినేష్ దేశాయ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అక్షర ప్రభాకర్ ఎడిటింగ్ బాగుంది. సచిన్ జిగర్ మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:-
ఏసీపీ భవాని శంకర్ గా పంకజ్ త్రిపాఠి ఒదిగిపోయాడు. లాయర్ గా విజయ్ వర్మ ఆకట్టుకున్నాడు. కరిష్మా కపూర్, సారా అలీఖాన్, డింపుల్ కపాడియా తమ అందంతో పర్వాలేదనిపించారు. ఇక మిగిలిన పాత్రలు తమ పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా...
రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉండటం.. స్లోగా సాగే కథనం కూడా ఉండటంతో ఫ్యామిలీతో కలిసి చూడలేం
రేటింగ్: 2/5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |