![]() |
![]() |

ప్రముఖ గాయని మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి కన్హ శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగివస్తున్న సమయంలో ఆమె కారుకి ప్రమాదం జరిగింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్-బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. వెనకాల నుండి వస్తున్న డిసియం ఢీ కొట్టడంతో.. మంగ్లీ కారు వెనుక భాగం స్వల్ప డ్యామేజ్ అయింది. ప్రమాద సమయంలో కారులో మగ్లితోపాటు డ్రైవర్ మేగరాజు, మనోహర్ లు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత అదే కారులో మంగ్లీ ఇంటికి వెళ్ళిపోయింది. కాగా, డీసీఎం డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించారు. ఒకవేళ డీసీఎం బాగా వేగంగా వచ్చినట్లయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు.
![]() |
![]() |