![]() |
![]() |
.webp)
ఇటీవల 'గామి' సినిమాతో ప్రేక్షకులను పలకరించి ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. త్వరలోనే మరో సినిమాతో అలరించనున్నాడు. అదే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.
గతేడాది చివరిలో విడుదల కావాల్సిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చి 8న విడుదలవుతుందని ఆమధ్య మేకర్స్ ప్రకటించారు. కానీ విడుదల కాలేదు. మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించలేదు. నిన్నటి వరకు ఎన్నికలు ఏప్రిల్ నెలలో ఉంటాయో, మేలో ఉంటాయో క్లారిటీ లేకపోవడంతో మేకర్స్ కొత్త డేట్ ని లాక్ చేయలేదు. అయితే తాజాగా పోలింగ్ తేదీపై క్లారిటీ వచ్చింది. మే 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మేకర్స్ కొత్త విడుదల తేదీని లాక్ చేశారు. పోలింగ్ కి, రిజల్ట్ కి మధ్యలో రిలీజ్ ని ప్లాన్ చేశారు. మే 17న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో లుంగీ ధరించి, నోట్లో బీడీతో ఉన్న విశ్వక్ సేన్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది.
మరి ఎన్నికల ఫలితాలకు 20 రోజుల ముందు వస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

![]() |
![]() |