![]() |
![]() |
.webp)
ప్రతీవారం అరడజను సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కాగా మరికొన్ని థ్రిల్లర్స్ . అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. ఎన్టీఆర్, ధోని లాంటి బయోపిక్ లకి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలోకి భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన మాజీ ఫ్రదాని అటల్ బిహారీ వాజ్ పేయి జీవితం ఆధారంగా అతని బయోపిక్ ని తీసుకొస్తున్నారు బాలీవుడ్ మేకర్స్.
భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం " మై అటల్ హూ". ఈ చిత్రానికి దర్శకుడు రవి జాదవ్. పంకజ్ త్రిపాఠి ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. మీర్జాపుర్ వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన పంకజ్ త్రిపాఠి హిందీలో చాలా సినిమాలలో నటించారు. పీయూష్ మిశ్రా, దయా శంకర్ పాండే, రాజా సేవక్, ఏక్తా కౌల్ కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీ థియేటర్లలో రిలీజై మిశ్రమ స్పందనలు పొందింది. అయితే ఇప్పుడు ఈ మూవీ పలు భాషల్లో డబ్బింగ్ జరుగుతోంది. ఈ నెల 14 నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఓటీటీ సంస్థ ఓ ట్వీట్ లో తెలిపింది.
ఈ మూవీలో అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితంతో పాటు.. రాజకీయంలో తన శైలి, అతడు ఎదుర్కున్న సవాళ్ళు ఉన్నాయి. అయితే ఇది హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అవ్వగా అక్కడివారికి మాత్రమే తెలసింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయితే ఇక దేశమంతటా అతడి వ్యక్తిత్వం తెలుస్తోందని మేకర్స్ భావించి ఈ నిర్ణయానికి వచ్చారంట. బయోపిక్ లకి ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. అందుకే దర్శక,నిర్మాతలు బయోపిక్ లు తీయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు మీరు చూసిన బయోపిక్ లలో ఏది మీ ఫేవరేటో కామెంట్ చేయండి.
![]() |
![]() |