![]() |
![]() |

సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. ఇటీవల విడుదలైన 'గామి' సినిమా మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. త్వరలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది.
విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన అడ్వెంచర్ ఫిల్మ్ 'గామి'. ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, మంచి అంచనాలతో మార్చి 8న విడుదలైంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను రాబడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.96 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.69 కోట్ల షేర్ రాబట్టిన గామి.. రెండు రోజుల్లో రూ.4.65 కోట్ల షేర్ సాధించింది. ఏరియాల వారీగా చూస్తే రెండో రోజుల్లో నైజాంలో రూ.2.29 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.66 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.1.70 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.55 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.1.70 కోట్ల షేర్ తో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.6.90 కోట్ల షేర్ రాబట్టింది. రూ.10.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గామి.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.3 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సింది ఉంది.
వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.4.56 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.34 కోట్ల షేర్ వసూలు చేసిన గామి.. మూడు రోజు ఆదివారం కావడంతో రూ.2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మొదటి వారంలోనే ఈ సినిమా లాభాల్లోకి ఎంటర్ కానుంది.
![]() |
![]() |