![]() |
![]() |

ఒకప్పుడు సినిమా హీరోయిన్లు పబ్లిక్ లో అంతగా కలిసే వాళ్ళు కాదు. ఎవరైనా వాళ్ళని చూడాలనుకున్నా కూడా వెంటనే జరిగే పని కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో హీరోయిన్ లు తమకి స్టార్ డం రావాలంటే ప్రజల్లో తమ పేరు నానుతూ ఉండాలనే సూత్రాన్ని కనిపెట్టారు. ఇప్పుడు ఆ కోవలోనే ఒక హీరోయిన్ చేసిన పని హాట్ టాపిక్ అయ్యింది.
నోరా పతేహి.. హిందీ చిత్ర సీమలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోయిన్. ప్రస్తుతం మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ అనే మూవీలో చేస్తుంది. షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్ ఒక లెవల్లో జరుగుతున్నాయి. అందులో భాగంగా ముంబై మెట్రో ట్రైన్ లో నోరా డాన్స్ చేసింది. కొన్ని రోజుల క్రితం మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ నుంచి బేబీ బ్రింగ్ ఇట్ ఆన్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ కే ఆమె డాన్స్ చేసింది.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫుల్ ఎనర్జీ తో నోరా చేసిన డాన్స్ కి మెట్రో ప్రయాణికులు ఫుల్ ఫిదా అయ్యారు. కొంత మంది తనతో పాటు కలిసి డాన్స్ కూడా చేసారు.

తెలుగులో బాహుబలి సినిమాలోని మనోహరి పాటలో ప్రభాస్ తో కలిసి నోరా చిందులేసింది. కిక్ 2 , షేర్, లోఫర్ లాంటి చిత్రాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. 2014 లో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. హిందీ, తెలుగు, మలయాళం, తమిళం లో ఇప్పటివరకు 25 చిత్రాలకి పైగానే చేసింది.వరుణ్ తేజ్ న్యూ మూవీ మట్కా లోను ఆమె నటిస్తుంది.
![]() |
![]() |