![]() |
![]() |
.webp)
మూవీ : మెర్రీ క్రిస్మస్
నటీనటులు: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, రాధిక శరత్ కుమార్, తదితరులు
ఎడిటింగ్: పూజా లతసూర్తి
మ్యూజిక్: ప్రీతమ్
సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్
నిర్మాతలు: రమేష్ తౌరాణి, జయా తౌరాణి, సంజయ్ రౌత్రే
దర్శకత్వం: శ్రీరామ్ రాఘవన్
కొత్త కథలు సినిమా లవర్స్ ఎప్పుడు ఆదరిస్తుంటారు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కలిసి నటించిన ' మెర్రీ క్రిస్మస్ ' తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్టీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం..
కథ:
అల్బర్ట్( విజయ్ సేతుపతి).. అప్పుడే నాసిక్ లోని ఓ జైలు నుండి బయటకు వస్తాడు. తన సొంతింటికి వెళ్ళి అక్కడ తన అమ్మ జ్ఞాపకాలని ఓసారి చూసుకుంటాడు. ఇక కాసేపటికి అతను ఓ హోటల్ కి డ్రింక్ చేయడానికి వెళ్తాడు. అదే సమయంలో మరియా( కత్రినా కైఫ్) తన కూతిరితో కలిసి ఒంటరిగా ఉంటుంది. అలా కాసేపటికి తన భర్త జెరూమీ మంచివాడు కాదని అందుకే తను వేరొకరితో డేట్ కి వెళ్ళిందని చెప్పి అల్బర్ట్ ని తన ఇంటికి డ్రింక్ ఆఫర్ చేస్తూ పిలుస్తుంది మరియా. ఆ తర్వాత కాసేపటి తర్వాత తన భర్త చనిపోవడం చూసి మరియా షాక్ అవుతుంది. ఇక అ విషయం పోలీసులకి మరియా చెప్పాలని చూస్తే అలా చెప్పొద్దని తను జైలు నుండి వచ్చినట్టుగా అల్బర్ట్ తన లైఫ్ స్టోరీని చెప్పి ఆపేస్తాడు. ఇక అది విని మరియా భయంతో తనని ఇంటినుండి పంపించేస్తుంది. ఆ తర్వాత రోనీ అనే మరో వ్యక్తిని ఇంట్లోకి తీసుకొస్తుంది మరియా. అసలు మరియా ఇంట్లో ఏం జరిగింది? మరియా భర్త జెరోమీని చంపిందెవరు? అల్బర్ట్ అసలు నేరస్తుడేనా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఇదో డిఫరెంట్ కథ.. రెగ్యులర్ కథలకి కాస్త వ్యత్యాసంగా సినిమా చూడాలంటే కాస్త ఇన్నోసెన్స్ తో పాటు మెచురిటీ కూడా ఉండాలని చూపించారు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్. కథంటే నాలుగు ఫైట్లు , రెండు పాటలనే కాకుండా మన చుట్టూ జరిగే కొంతమంది జీవితాలని చూసి ఇన్ స్పైర్ అయి కూడా రాయొచ్చని, దానిని తెరపై చూపించొచ్చని చూపించారు.
థ్రిల్లర్ సినిమా అనగానే బోల్డెన్ని ట్విస్ట్ లు, ఎత్తుకు పైఎత్తులు, ఫైట్లు లాంటివి సాగాలానే పంథాను వదిలేసి.. కథలో భాగంగానే క్యారెక్టర్ లో కావలిసిన డిఫరెంట్ వేరియేషన్స్ ని తీసుకొని గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లేతో అలా చివరిదాకా తీసుకెళ్ళారు. ఇప్పటిదాకా మనకి పరిచయం ఉన్న నాలుగైదు క్యారెక్టర్ లతో చివరి వరకు తీసుకెళ్ళడం కత్తి మీద సాములాంటిది. అలాంటిది సాంగ్స్ ని సీన్స్ కి తగ్గట్టుగా చేయడం బాగుంది.
అందరు సంతోషంగా ఉన్నట్టుగా మెర్రీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు.. మనం కూడా సంతోషంగానే ఉన్నట్టుగా ఉండాలి అనే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. అన్ని ఫోటోలలో నవ్వుతూనే ఉన్నారు కదా ఎందుకు విడిపోయారని హీరోయిన్ ని హీరో అడిగినప్పుడు.. ఏడుస్తున్నప్పుడు ఎవరైన ఫోటోలు తీసుకుంటారా అని హీరోయిన్ చెప్పడంతో కథపై మరింత ఆసక్తి కలుగుతుంది. అయితే సినిమా చాలా వరకు నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్ , సెకండాఫ్ అంతా కథనం అలా స్లోగా వెళుతుంది. అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికి అవన్నీ క్లైమాక్స్ లో రివీల్ చేయడం బాలేదు. ఇదే సినిమా ఓ మూడు సంవత్సరాల క్రితం వస్తే కల్ట్ క్లాసిక్ అయ్యేది. రిలీజ్ కాస్త లేట్ అయింది అంతే.
మ్యూజిక్ ప్రతీ సిచువేషన్ ని ఎలివేట్ చేసింది. కొన్ని చోట్ల సీన్ కి తగ్గట్టుగా ఉండేలా పాటలని చేర్చడం బాగుంది. అయితే ఈ సినిమాని కాస్త ఓపికతో చూడాలి. అది కూడ అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూసేయాలి లేదంటే చూడటం కష్టమే. ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అయితే ఈ కథకి నిడివి రెండు గంటలు చాలా ఎక్కువ. నిర్మాణ విలువలు బాగున్నాయి. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పూజా లత సూర్తి ఎడిటింగ్ నీట్ గా ఉంది. ప్రీతమ్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.
నటీనటుల పనితీరు:
అల్బర్ట్ గా విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. మరియాగా కత్రినా కైఫ్ వహ్ అనిపించింది. అనుభవం గల పోలీసు అధికారిగా రాధిక శరత్ కుమార్ ఆకట్టుకుంది. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఫైనల్ గా :
ఢిఫరెంట్ కథలని చూసేవారికి నచ్చే ఈ సినిమా.. కామన్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు.
రేటింగ్ : 2.5/5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |