![]() |
![]() |

కొన్ని సినిమాలు టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఆసక్తిని కలిగించడమే కాదు విడుదల కోసం కూడా ఎదురు చూసేలా చేస్తుంటాయి. ఆ కోవకి చెందిన ఒక మూవీ గురించి ప్రముఖ హీరో ప్రస్తావించడం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.
తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా రవి పనస ఫిలిం కార్పోరేషన్ ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది. మహా శివరాత్రి కానుకగా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. 'భగవంతుడు' అనే ఒక సూపర్ పవర్ ఉన్న టైటిల్ ని మేకర్స్ నిర్ణయించారు. పైగా ప్రముఖ హీరో రానా దగ్గునాటి చేత పోస్టర్ రిలీజ్ జరిగింది. ఈ మేరకు మేకర్స్ రానా కి థాంక్స్ చెప్పారు. అలాగే రానా కూడా తన ట్విట్టర్ ద్వారా టీంకి బెస్ట్ విషెస్ చెప్పాడు. గజ్జలని కట్టుకున్న ఒక మనిషి కాళ్ళని పోస్టర్ లో రివీల్ చేసారు. పోస్టర్ ఎంతో క్రియేటివ్ గా ఉంది.

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమా సహకారంతో రవి పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయనకి నిర్మాతగా ఇదే మొదటి మూవీ. జి జి విహారి దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. తరాలకి మించిన కథగా భగవంతుడు తెరకెక్కుతుంది. ఎన్నో అగ్ర చిత్రాలకి ఎడిటర్ గా చేసిన ప్రవీణ్ పూడి ఈ సినిమాకి వర్క్ చేస్తుండటం విశేషం.
![]() |
![]() |