![]() |
![]() |
.webp)
కామెడీ అండ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న నటుడు సుహాస్. గత నెలలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో మంచి విజయాన్నే అందుకున్నాడు. ప్రస్తుతం ప్రసన్న వదనం అనే మరో మూవీ ఆయన ఖాతాలో ఉంది. ఆ మూవీకి సంబంధించిన టీజర్ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ సంధర్బంగా సుహాస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
నేను ఇప్పటివరకు చేయనిది ప్రసన్న వదనంలో చేశాను. అసలు ఎప్పుడు కూడా అలా చేస్తానని అనుకోలేదు. దాని గురించి మాట్లాడటానికి కూడా సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు ఈ మాటలన్నీ సుహాస్ చెప్తున్నాడు. అసలు విషయం ఏంటంటే ప్రసన్న వదనంలో లిప్ లాక్ సీన్ ఉంది. కథ డిమాండ్ మేరకు మేకర్స్ ఆ సన్నివేశాన్ని పెట్టవలసి వచ్చింది. ఆ లిప్ లాక్ సీన్ లో సుహాస్ నటించాడు. అలా చెయ్యడానికి సిగ్గు పడ్డాననే విషయంలోనే సుహాస్ పైన చెప్పుకున్న కామెంట్స్ చేసాడు.

పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత తదితరులు సుహాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అర్జున్ Y.K. రచనా దర్శకత్వంలో మణికంఠ,ప్రసాద్ రెడ్డి లు నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2022 లో వచ్చిన కలర్ ఫొటోతో సుహాస్ హీరోగా తన కెరీర్ ని ప్రారంభించాడు. ఆ మూవీ నేషనల్ అవార్డు ని కూడా గెలుచుకుంది.
![]() |
![]() |