![]() |
![]() |

ప్రభాస్ సినిమాలకి, కట్ అవుట్ కి ఎంత ఇమేజ్ ఉందో ప్రభాస్ గురించి వచ్చే న్యూస్ కి కూడా అంతే ఇమేజ్ ఉంది.ఫ్యాన్స్ అయితే తన న్యూ మూవీ వచ్చే వరకు న్యూస్ ల కోసం నెట్ లో సెర్చ్ చేస్తునే ఉంటారు. అలా సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఒక అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ లో నయా జోష్ వచ్చింది. అదే టైం లో ఆ న్యూస్ వైరల్ గాను మారింది.
డార్లింగ్ నయా మూవీ కల్కి 2898 ఏ.డి.. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తు ఉంది. శరవేగంగా షూటింగ్ ని కూడా జరుపుకుంటుంది. అందులో భాగంగా ఇటలీలో ఒక సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.ప్రభాస్ అండ్ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దిశాపటాని మీద ఆ సాంగ్ ని షూట్ చేస్తున్నారు.షూట్ గ్యాప్ లో వాళ్లిద్దరు దిగిన ఒక ఫోటోని మేకర్స్ విడుదల చేసారు.కెమెరాని చూస్తు నవ్వుతున్న ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అలాగే ప్రభాస్ స్టైలిస్ట్ లుక్ గురించి కూడా అందరు చర్చించుకుంటున్నారు.

దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నట దిగ్గజాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మే 9 2024న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కాబోతుంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వని దత్ నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ప్రభాస్ సినీ కెరీర్లోనే అత్యధిక బడ్జట్ తో రూపుదిద్దుకుంది.ఇక ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు మే నెల వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
![]() |
![]() |