![]() |
![]() |

ఆమె మామలు వ్యక్తి కాదు. సినిమా హీరోయిన్. మరి హీరోయిన్ అంటే మాటలా ఎంతో క్రేజ్ ఉంటుంది కదా! కానీ ఒకే ఒక్క సంఘటనతో ఇప్పుడు ఆ హీరోయిన్ క్రేజ్ మొత్తం పోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా! ఆమె పేరు సౌమ్య శెట్టి. ఇంతకీ తను ఏం చేసిందో చూద్దాం.
వైజాగ్ కి చెందిన సౌమ్య శెట్టి ది ట్రిప్, యువర్స్ లవింగ్లీ లాంటి మూవీస్ లో చేసింది. తన నటనకి మంచి మార్కులు కూడా పడ్డాయి. వైజాగ్ కే చెందిన ప్రసాద్ అనే రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కూతురు కి సౌమ్య ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. అప్పట్నుంచి ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. దీంతో సౌమ్య తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్లొస్తుంటుంది .ఈ క్రమంలోనే అందరి కళ్ళు గప్పిన సౌమ్య కిలో బంగారాన్ని దాకా దొంగతనం చేసింది. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది
కాకపోతే ఇందులో కొసమెరుపు ఏంటంటే విడతల వారీగా సౌమ్య బంగారాన్ని దొంగతనం చేసింది.చాలా రోజుల పాటు బంగారం పోయిందనే విషయం ఎవరకి తెలియదు.ప్రసాద్ కూతురు ఒక శుభకార్యం కి వెళ్లాల్సి వచ్చినప్పుడు విషయం బయటపడింది. దీంతో పోలీసులకి కంప్లైంట్ చేసారు.రంగ ప్రవేశం చేసిన పోలీసులు సౌమ్య శెట్టి నే దొంగ తనం చేసిందనే నిర్ధారణకు వచ్చి అరెస్ట్ చేసారు. ఆమె దగ్గర కొంత బంగారం కూడా దొరికింది. దొంగతనం తర్వాత గోవాలో కొన్ని రోజులు ఉండొచ్చింది. మిగతా బంగారం అడిగితే సూసైడ్ చేసుకుంటానని అంటుండం గమనార్హం.
![]() |
![]() |