![]() |
![]() |

కొంతకాలంగా మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా ఉండే ఈ సినిమాలు చూడటానికి తెలుగు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో ఎన్నో మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విశేష ఆదరణ పొందుతున్నాయి. థియేటర్లలో కూడా మలయాళ డబ్బింగ్ సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'ప్రేమలు'. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కావడంతో.. మలయాళ వెర్షన్ కి తెలుగునాట కూడా మంచి ఆదరణే లభిస్తోంది. అయితే త్వరలోనే తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాబోతుంది.
'ప్రేమలు' తెలుగు రైట్స్ ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయ దక్కించుకున్నాడు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల కానుంది. మరి 'ప్రేమలు' తెలుగు వెర్షన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |