![]() |
![]() |
25 సంవత్సరాల క్రితం నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా నిలబడిరది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 70 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయంటే ఆమె ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దిగ్విజయంగా 25 సంవత్సరాల కెరీర్‌ను పూర్తి చేసుకున్న త్రిషను ఇటీవల పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆమె ప్రమేయం లేకుండానే వివాదాల ద్వారా వార్తల్లోకి ఎక్కుతోంది.
ఆమధ్య ‘లియో’ చిత్రంలో విలన్‌గా నటించిన మన్సూర్ అలీఖాన్.. త్రిషపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఎంతోమంది సెలబ్రిటీస్ ఆమెకు మద్దతుగా నిలిచారు. చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకునేందుకు త్రిష సిద్ధపడడంతో అతను క్షమాపణలు చెప్పాడు. అలా ఆ వివాదానికి తెరపడిరది. తాజాగా అన్నా డిఎంకె నాయకుడు ఎ.వి.రాజు చేసిన వ్యాఖ్యలతో మరోసారి త్రిష వార్తల్లోకి వచ్చింది. ఓ ప్రముఖ రాజకీయ నేత ఆమెకు రూ.25 లక్షలు చెల్లించి రిసార్ట్‌కి తీసుకెళ్లాడంటూ అతను వ్యాఖానించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎ.వి.రాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచిన త్రిష అతనికి నోటీసులు పంపింది. ఈ వ్యవహారంలో హీరో విశాల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్, సముద్రఖని, నాజర్ ఆమెపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిరచారు. ఈ విషయంలో తనకు మద్దతు ఇచ్చిన ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా త్రిష స్పందించింది. అయితే ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, ఎలా ముగుస్తుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చెయ్యక తప్పదు.
ఇక త్రిష చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అజిత్ సరసన ‘విడాముయర్చి’ చిత్రంలో నటిస్తోంది. అలాగే మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది. అందులో మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ‘రామ్’ కూడా ఉంది. ఇక కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘థగ్స్ లైఫ్’ చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘విశ్వంభర’లో కూడా నటిస్తోంది. ఇవికాక వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో కూడా త్రిషను హీరోయిన్‌గా బుక్ చేశారని తెలుస్తోంది.
![]() |
![]() |