![]() |
![]() |
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఎడి’. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో రూపొందని ఒక డిఫరెంట్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చెయ్యబోతున్నారు. ‘సలార్’ వంటి భారీ హై ఓల్టేజ్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘కల్కి’ ఎలాంటి సినిమా, దాని కథ ఏమిటి అనే విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారుతోంది.
సైన్స్, పురాణాలు వంటి అంశాలతో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి నాగ్ అశ్విన్ ఏం చెప్పాడంటే.. ఈ సినిమా మహాభారతం నుంచి మొదలై 2898లో ముగుస్తుంది. అందుకే ‘కల్కి 2898ఎడి’ అనే టైటిల్‌ని పెట్టాం. ఈ సినిమా 6000 సంంత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేసాం’ అంటూ వివరించాడు.
ఈ సినిమా కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు.
![]() |
![]() |