![]() |
![]() |

మూవీ : ఆంటోనీ
నటీనటులు: జోజు జార్జ్, కళ్యాణి ప్రియదర్శన్, చెంబన్ వినోద్ జోస్, నైలా ఉశా తదితరులు
ఎడిటింగ్: శ్యామ్ శశిధరణ్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: రెనదీవ్
నిర్మాతలు: ఐన్ స్టీన్ జాక్ పాల్
దర్శకత్వం: జోషీ
ఓటీటీ: ఆహా
జోజు జార్జ్, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ' ఆంటోనీ'. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో విడుదలైంది. మరి ఆ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
ఓ రాత్రి అడవిలో ఒకడిని వెంబడిస్తూ ఆంటోనీ పరుగెడుతుంటాడు. కాసేపటికి అతడిని పట్టుకొని కాలు నరికేస్తాడు. ఆ తర్వాత హోలీ మేరీ అనే ఇంజనీరింగ్ కాలేజీలో బాక్సింగ్ పోటీ జరుగుతుంది. మరియాకి ఆ కాలేజీ లాస్ట్ ఇయర్ చాంపియన్ కి మధ్య జరిగిన ఆ పోటీలో మరియా గెలుస్తుంది. అయితే మరియా నాన్న అప్పుడే చనిపోయాడనే కబురుతో వాళ్ళ ఊరువాళ్ళు కాలేజీకి వస్తారు. ఇక ఆ వార్త తెలుసుకున్న మరియా ఇంటికి వెళ్తుంది. మరియా వాళ్ళ అమ్మ కొన్నిరోజులకి కోర్టులో లాయర్ ని ఆశ్రయిస్తుంది. అప్పుడే ఓ రౌడీ వచ్చి నడిరోడ్డులో ఆంటోనీ అనుచరుడి కాలు నరికేస్తాడు. ఆ తర్వాత ఆంటోనీ యొక్క శత్రువు కొంతమంది రౌడీలని పంపిస్తాడు. అసలు ఆంటోనీని చంపాలని చూస్తోంది ఎవరు? ఆంటోనీ, మరియాల మధ్య సంబంధమేంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
ఆంటోనీ ఒక రౌడీని కాలు నరకడంతో.. అసలెవరతను ఎందుకలా చేశాడనే క్యూరియాసిటితో సినిమాపై ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు జోషీ. ఇక అక్కడి నుండి బాక్సింగ్ సీన్స్ తో మరియా ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఆంటోనీ, మరియా చుట్టూ తిరిగే ఈ కథలో ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది.
ద్వితీయార్థంలో ఆంటోనీ పాత్ర చుట్టూ తిరిగుతుంటుంది. అయితే కొన్ని సీన్లని అనవసరంగా ఉంచారనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా ఉంది. అయితే ఆంటనీ, మరియాల మధ్య గల సంబంధమేంటని ఓ క్లారిటీ ఇవ్వలేదు డైరెక్టర్. క్లైమాక్స్ లో అంటోనీని చంపాలనుకున్నది ఎవరు? ఎందుకు చంపాలనుకున్నాడనే స్పష్టత ఇవ్వకుండా ముగించారు మేకర్స్. అసలు రెండవ భాగం ఉంటుందని కూడా చెప్పకుండా ముగించేశారు.
ఫస్టాఫ్ తో పోలీస్తే సెకండాఫ్ కాస్త మెరుగ్గా ఉంది. అయితే కొన్ని పాత్రలు స్క్రీన్ మీదకి ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంటర్వెల్ ముందు వరకు విలన్ కి ఎలవేషన్ గట్టిగా ఇస్తారు. అయితే అతని స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మరీ అర నిమిషమే ఉంటుంది. అసలు విలన్ ఉన్నాడా లేడా అన్నట్టుగా వన్ సైడ్ హీరోయిజం సాగుతుంది. అయితే సెకండాఫ్ లో నాన్న, కూతిరి బాండింగ్ ని చక్కగా ప్రదర్శించారు.
రెనదీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ సీన్లని ఎలవేట్ చేసేదిలా ఉంది. శ్యామ్ శశిధరణ్ ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
జోజు జార్జ్ సినిమాకి ఫ్రధాన బలంగా నిలిచాడు. వన్ మ్యాన్ షోగా ఆంటోనీ పాత్రలో జోజు జార్జ్ ఆకట్టుకున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ చక్కని అభినయాన్ని ప్రదర్శించింది. మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు..
ఫైనల్ గా :
వన్ టైమ్ వాచెబుల్ మూవీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు
రేటింగ్ : 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |