![]() |
![]() |

బర్త్ డే అంటే ఎప్పుడు గిఫ్ట్ లని తీసుకోవడమేనా గిఫ్ట్ లని ఇవ్వడం కూడాను అంటున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ రోజు తన పుట్టిన రోజు.ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే రేంజ్ లో అదిరిపోయే గిఫ్ట్ ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ గిఫ్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ ని సృష్టించే పనిలో బిజీగా ఉంది.
నాని హీరోగా వస్తున్న నయా మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీ నుంచి కొద్దిసేపటి క్రితమే గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. కోపం అందరకి వస్తుంది కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా వస్తుంది. కానీ కోపాన్ని ఒక క్రమ పద్దతిలో వాడుతూ వారానికి ఒక సారి మాత్రమే దాన్ని వాడే అతన్ని మీరెప్పుడైనా చూసారా! ఒక వేళా ఆ విధంగా వాడితే అది సరిపోదా శనివారం హీరో అవుతాడు. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ తో మేకర్స్ నానిని చూపించడం సూపర్ గా ఉంది. నాని కూడా చాలా కొత్తగా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. గ్లింప్స్ చివరలో ఎస్ జె సూర్య పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనపడి హ్యాపీ బర్త్ డే బ్రదర్ అని నవ్వడం సినిమా మీద మరింత క్యూరియాసిటీని పెంచింది.

ఇప్పుడు ఈ గ్లింప్స్ చూసిన నాని ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అనుకుంటున్నారు. అలాగే నానికి బర్త్ డే విషెస్ కూడా చెప్తున్నారు. డివివి ఎంటర్టైన్ మెంట్స్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ నానికి జత కడుతుంది.ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రని పోషిస్తున్నాడు.టైటిల్ కి తగ్గట్టే శనివారం రోజున గ్లింప్స్ రిలీజ్ అవ్వడం, శనివారం రోజునే నాని పుట్టిన రోజు రావడం ఎట్రాక్షన్ గా మారింది. అగస్ట్ 29 న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
![]() |
![]() |